మోదీ ఉంటే కశ్మీర్‌ అంశం తేలదు..

by Shamantha N |
మోదీ ఉంటే కశ్మీర్‌ అంశం తేలదు..
X

దిశ,వెబ్‌డెస్క్
భారత ప్రధానిగా మోదీ ఉన్నంత కాలం కశ్మీర్‌ విషయంలో ఏమీ చేయలేమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత్‌లో మరో బలమైన నాయకుడు వస్తేనే కశ్మీర్‌ సమస్య పరిష్కారమవుతుందని, కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తామని దేశ విభజన సమయంలో ఇచ్చిన మాటను నెహ్రూ నిలబెట్టుకోలేదని తెలిపారు. అయితే
జమ్ముకాశ్మీర్‌లో 370అధికరణ రద్దు చేసినప్పటి నుంచి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం సర్వసాధారణంగా మారిపోయింది. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు మోడీ సిద్ధంగా లేడని, అది పూర్తిగా భారత అంతర్గత విషయమని బీజేపీ నాయకులు పదేపదే చెప్పడం పాక్ నాయకులకు రుచించడం లేనట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed