పాలమూరు జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ : మంత్రి

by vinod kumar |
minister srinivas goud
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు జనరల్ ఆస్పత్రిలో అతి త్వరలోనే ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. శనివారం మంత్రి జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు తదితర అధికారులతో కలిసి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఏర్పడిందని, దీంతో ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను చేస్తామని మంత్రి అన్నారు. దాదాపు నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అంతకుముందు ఎస్‌ఎన్‌జీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన వసతిని పరిశీలించి ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులకు, కార్మికులకు పంపిణీ చేశారు. కోవిడ్ పేషెంట్లకు పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సమస్యలు లేకుండా టెస్టులు చేయాలని మంత్రి సిబ్బందిని ఆదేశించారు.

‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి

జిల్లా కేంద్రంలోని ఏనుగొండ జర్నలిస్ట్ కాలనీలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేసి ఇండ్లను అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, నందలాల్ పవర్, గృహ నిర్మాణ శాఖ ఈఈ భాస్కర్ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed