హైదరాబాద్‌కు చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

by Shyam |
Oxygen Express
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూడవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లోని సనత్ నగర్ గూడ్స్ కాంప్లెక్స్‌కు బుధవారం చేరుకుంది. ఈ నెల 9న ఐదు ఖాళీ ట్యాంకర్లతో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఒడిస్సాకు బయల్దేరిందని, 64.24 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ నింపుకొని 27 గంటల్లోనే తిరిగి హైదరాబాద్ చేరుకుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. క్లిష్ట సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్‌ను సురక్షితంగా, భద్రంగా నిరాటకంగా, సజావుగా రవాణా చేయడానికి భారతీయ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభించామన్నారు.

ఈ రైళ్లు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు నడుపబడుతున్నాయని వెల్లడించారు. ఆక్సిజన్ రైళ్లను నడపడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే డివిజన్ల అధికారులకు సూచించారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వేగవంతంగా, నిరాటకంగా నడపడంలో కృషి చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed