- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి మృతదేహానికి కొడుకు చేత కరోనా టెస్ట్
దిశ, వెబ్ డెస్క్: వైద్య సిబ్బందికి రోగులు చేతులెత్తి మొక్కుతుంటారు. ఎందుకంటే, చికిత్స సమయంలో వారు చూపించి అభిమానం, మనకు చేసే సేవలు ఆదర్శంగా ఉంటాయి. అందుకే వారికి చేతులెత్తి మొక్కుతుంటారు. కానీ, కొంతమంది వైద్యసిబ్బంది ఇందుకు వ్యతిరేకం. ప్రస్తుత కరోనా సమయంలో భరోసాగా నిలవాల్సిందిపోయి తమ బాధ్యతలను మరిచిపోతున్నారు. బాధిత కుటుంబంతో బాధ్యతగా నిలవాల్సిందిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
విషయమేమిటంటే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలగూడెంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అయితే ఆ వ్యక్తి మృతదేహానికి అతడి కుమారుడితో వైద్య సిబ్బంది.. కరోనా టెస్టులు చేయించారు. అంతేకాదు.. ఈ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించలేదు. తమ డ్యూటీని బాధిత కుటుంబ సభ్యులతో చేయించిన ఆ వైద్య సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.