- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్‌లో 20 లక్షల మందికి ‘లాంగ్ కొవిడ్’
దిశ, ఫీచర్స్ : ‘కొవిడ్’ వైరస్ శరీరంలో ఉండేది రెండు వారాలే కానీ దాని ప్రభావం మాత్రం కొన్ని నెలల పాటు ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తు్న్నారు. పోస్ట్ కొవిడ్ తర్వాత ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువకాలం వరకు కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. ఆ సమస్యలనే ‘లాంగ్‌కొవిడ్’ అంటున్నారు. ఈ సమస్య ఇంటెన్సివ్‌కేర్‌లో ఉండి కోలుకున్నవాళ్లకే పరిమితం కాలేదు, తేలికపాటి లక్షణాలు ఉన్నవాళ్లలోనూ ఉంది. లాంగ్ కొవిడ్ బాధితులు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారటం, అధిక అలసట, తలనొప్పి, కీళ్లు లేదా కండరాల నొప్పులు, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు ఎదుర్కొంటున్నారు. ఇంగ్లాండ్‌లో 2 మిలియన్లకు పైగా ప్రజలు సుదీర్ఘ కొవిడ్ 19 కలిగి ఉన్నారని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను కనీసం 12 వారాల పాటు అనుభవిస్తున్నారని మహమ్మారిపై చేపట్టిన అతిపెద్ద స్వర్వేలైన్స్ స్టడీ పేర్కొంది.
కొవిడ్-19 కలిగి ఉన్న వారిలో మూడింట ఒక వంతు మందికి కనీసం 12 వారాల పాటు లక్షణాలు ఉన్నట్లు లండన్ ఇంపీరియల్ కాలేజీ నేతృత్వంలోని జరిగిన రియాక్ట్-2(REACT-2) అధ్యయనంలో కనుగొన్నారు. పదిమందిలో ఒకరు తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటున్నారని తేలింది. ప్రభుత్వ మద్దతుతో సెప్టెంబర్ 2020 – ఫిబ్రవరి 2021 మధ్య 508,707 మంది నుంచి సేకరించిన డేటా ఆధారంగా అధ్యయన ఫలితాలు వెల్లడించారు. అలసట, కండరాల నొప్పులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చాతీ నొప్పి వంటి లక్షణాలు సాధారణమైనవని వీటి గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ప్రతి దశాబ్దంలో 3.5% సంభావ్యతతో, వృద్ధులు ఎక్కువ కాలం కొవిడ్‌కి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. మహిళలు, ధూమపానం చేసేవాళ్లు, అధిక బరువు ఉన్నవారు, అణగారిన ప్రాంతాల్లో నివసించేవారు లేదా ఆసుపత్రిలో చేరిన వారిలో నిరంతర లక్షణాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఇది ఆసియా జాతి ప్రజలలో తక్కువగా ఉంది. శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత రెండు వారాల్లో వైరస్ అంతమైనా అది శరీరానికి చేసిన నష్టం, ఇన్ఫెక్షన్, సైటోకైన్ స్టార్మ్ ప్రభావాల వల్ల దెబ్బతిన్న అవయవ వ్యవస్థలు పూర్తిగా నయమవ్వడానికి కొంతకాలం పడుతుందని, అందుకే లాంగ్కొవిడ్ఎఫెక్ట్ కొందరిలో ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
‘ఈ లాంగ్ కొవిడ్ ఆయా వ్యక్తులపై మానసింకగానూ శాశ్వత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కొవిడ్‌ను ఎదుర్కొన్నట్లే వీటి విషయంలోనూ పాజిటివ్‌గా ముందుకు వెళ్లాలి. వాటిపట్ల అందరూ అవగాహన పెంచుకోవాలి. కొవిడ్ చికిత్సలను అభివృద్ధి పరచడానికి ఈ ఫలితాలతో పాటు, ఇతర కొత్త పరిశోధనలను ఉపయోగిస్తాం’
– పాల్ ఇలియట్, ఇంపీరియల్ రియాక్ట్ స్టడీ డైరెక్టర్.