నవదీప్ ‘న్యూసెన్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

by Aamani |   ( Updated:2023-05-07 14:34:50.0  )
నవదీప్ ‘న్యూసెన్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవదీప్, బిందు మాధవి కలిసి నటించిన వెబ్‌ సిరీస్ ‘న్యూసెన్స్’. శ్రీ ప్రవణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నుంచి తాజాగా ఆసక్తికరమైన ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్.. ఈ వెబ్ సిరీస్‌ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలిపారు. ఈ నెల 12న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా.. మీడియా రంగాన్ని ఉద్దేశించి సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేటి మీడియా డబ్బుకు ఎలా ప్రభావితమవుతుంది? రాజకీయాలకు ఎలా అమ్ముడుపోతుంది? అనేది ఇందులో చూపించినట్లు సమాచారం.

Also Read..

నయనతారపై షారుఖ్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story