- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఆహా’ ఈజ్ బ్యాక్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత ఆహా ఓటీటీ సంస్థను స్టార్ట్ చేశారు. మొదట దీనిని తెలుగులో ప్రారంభించి ఆ తర్వాత తమిళంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా పలు వెబ్ సిరీస్‌లు సినిమాలు స్ట్రీమింగ్ చేస్తూ ఎంతో మందిని అలరిస్తున్నారు. అయితే గత రెండు రోజుల క్రితం ఆహాను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తన పాలసీకి విరుద్ధంగా ఉన్న యాప్స్ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకునే వారికి అందుబాటులో లేకుండా చేసింది. దీంతో ఆహా అకౌంట్ ఉన్నవారికి కూడా సినిమాలు స్ట్రీమింగ్ కాక పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు డబ్బులు రీఫండ్ చేయాలని తమ ఆవేదనను సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా, ఆహా మళ్లీ అందుబాటులోకి వచ్చింది.
ఈ విషయం తమ యూజర్లకు తెలియజేస్తూ సంస్థ వారు ట్వీట్ చేశారు. ‘‘హే, మా యాప్ Google Play స్టోర్‌లో తిరిగి వచ్చింది! దయచేసి సబ్‌స్క్రైబ్ చేయడానికి/యాక్సెస్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి. ఇప్పటికే ఉన్న aha సబ్‌స్క్రైబర్‌లు Google Play Store నుండి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించి సైన్-ఇన్ చేయవచ్చు, వారికి ఇష్టమైన చలనచిత్రాలు, షోలను చూసి ఆనందించవచ్చు. మీరు ఇప్పుడు మా Android మొబైల్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి, మీకు ఇష్టమైన సినిమాలు & షోలను యాక్సెస్ చేయాలనుకుంటే, ఈ దశలను అనుసరించండి: 1. మీ వెబ్ బ్రౌజర్‌లో ఈ URLని సందర్శించండి. మీరు ఇష్టపడే ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందండి: https://aha.video/వ్యూప్లాన్స్ 2. విజయవంతమైన కొనుగోలు తర్వాత, ఆహా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ని సందర్శించండి. మీ ఖాతాతో సైన్-ఇన్ చేయండి. స్ట్రీమింగ్‌ను ఆస్వాదించండి!’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఓటీటీ ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు.