- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విస్తరణ బాటలో ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ దేశీయంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. దీనికోసం రాబోయే రెండేళ్లలో తమ ఉద్యోగుల సంఖ్యను 2,000 మందికి పెంచాలని లక్ష్యంగా ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సంస్థలో మొత్తం 300 మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడున్న కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం రాబోయే రెండేళ్లకు సరిపోతుందని, త్వరలో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(ఓఈఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గురురాజ్ అన్నారు.
మొబైల్‌ఫోన్, ఐటీ హార్డ్‌వేర్, టెలికాం ఉత్పత్తుల కోసం ఉత్పత్తి అనుసంధాన పథకం(పీఎల్ఐ) కోసం ఓఈఎల్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. పీల్ఐ పథకం కింద కంపెనీ పెట్టుబడులను పెట్టనుంది. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని బట్టి మొదటి ఏడాది సరఫరా వ్యవస్థ సవాళ్లను అధిగమించనున్నామని, ఆ తర్వాత మిగిలిన లక్ష్యాలను చేరుకోగలమనే నమ్మకం ఉన్నట్టు గురురాజ్ తెలిపారు. మొబైల్ పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్, టెలికాం పరికరాలు మొదలైన వాటి ఉత్పత్తిని పెంచేందుకు తమ పాత జాయింట్ వెంచర్ భాగస్వామి యాపిల్‌తో కాంట్రాక్ట్ ఒప్పందంపై సంతకం చేసినట్టు కంపెనీ పేర్కొంది.
కాగా, ఈ ఏడాది ఆగష్టులో ఆయా పరికరాల తయారీ కోసం రూ. 1,350 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఎలక్ట్రిక్ మాన్యూఫక్చరింగ్ సర్వీసెస్ ద్వారా వచ్చే 3-5 ఏళ్లలో రూ. 38 వేల కోట్ల ఆదాయంతో పాటు 11,000 మంది ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఉన్నామని ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది.