వైఎస్ వల్లే మున్సిపల్ చైర్మన్ అయ్యా.. దాని కోసం ఎంతదూరమైనా వెళ్తా : జేసీ

by srinivas |
JC Prabhakar Reddy
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ బలోపేతం కోసం.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ఎవరినైనా ఎదిరిస్తా… ఎంత దూరమైనా వెళ్తా అంటూ తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కండువా వేసుకున్నా వేసుకోకపోయినా మోసం చేయనని.. గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. శుక్రవారం తాడిపత్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యంతో తాను మున్సిపల్ చైర్మన్ అయినట్లు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు పుణ్యంతో ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు.

త్వరలో 10 వేల మందితో సమావేశం నిర్వహిస్తానని దానికి చంద్రబాబును ఆహ్వానించబోతున్నట్లు తెలిపారు. టీడీపీ అంటే తనకు చాలా అభిమానమని.. ఒకవేళ తనను చంద్రబాబు సస్పెండ్ చేసినా.. నేను ఆ పార్టీ నుంచి వెళ్లనని, పార్టీకోసం పనిచేస్తానని తెలిపాడు. కొందరు పార్టీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును మళ్ళీ సీఎం పీఠంపై కూర్చోబెట్టడమే తన లక్ష్యమన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవారిని వెంటబెట్టుకుని పల్లెపల్లెకూ తిరుగుతామని జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story