రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ

by Shamantha N |
రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ
X

ఢిల్లీ: నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో రేపు భేటీ కానున్నారు. సీపీఎం జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే నేత, సీపీఐ జనరల్ సెక్రెటరీ డీ. రాజాలతో కూడిన ఐదు సభ్యుల ప్రతినిధుల బృందం ప్రతిపక్షాల తరఫున రేపు సాయంత్రం రాష్ట్రపతితో సమావేశమవనున్నారు.

రాష్ట్రపతిని కలవడానికి ముందు తాము సమావేశమై వ్యూహంపై చర్చిస్తామని సీతారాం ఏచూరి అన్నారు. కరోనా కారణంగా కేవలం ఐదుగురమే వెళ్తున్నామని, ఇతర విపక్షపార్టీలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రపతిని కలవనున్నట్టు తెలిపారు. పార్టీల నేతలు సమావేశమై సంయుక్త వ్యూహంతో రాష్ట్రపతిని కలుస్తామని శరద్ పవార్ చెప్పారు.

Advertisement

Next Story