అప్రజాస్వామికంగా బిల్లులను ఆమోదించారు: రాహుల్

by Shamantha N |   ( Updated:2020-12-09 08:26:39.0  )
అప్రజాస్వామికంగా బిల్లులను ఆమోదించారు: రాహుల్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను విపక్ష నేతల బృందం బుధవారం కలిసింది. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనను రాష్ట్రపతికి విపక్ష నేతలు వివరించారు. మూడు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అప్రజాస్వామికంగా వ్వవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆయన తెలిపారు. ఎవరితో సంప్రదింపులు జరపకుండా బిల్లు తీసుకు వచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రైతుల సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని శరద్ పవార్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed