సిట్టింగ్ చేతికే బీజేపీ పగ్గాలు..!

by Shyam |   ( Updated:2020-03-01 08:28:05.0  )
సిట్టింగ్ చేతికే బీజేపీ పగ్గాలు..!
X

దిశ, రంగారెడ్డి : రాష్ట్రంలో ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియను బీజేపీ అధిష్టానం మొదలు పెట్టింది. కాగా మూడు విడతల్లో జిల్లా అధ్యక్షులను ప్రకటించనున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా అధ్యక్ష రేసులో ఆరుగురు నేతలు ఉన్నప్పటికీ సిట్టింగ్ వ్యక్తికే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ప్రతినిధులు జిల్లాలోని కౌన్సిల్ మెంబర్స్, మండల కమిటీ మెంబర్స్, ముఖ్యుల అభిప్రాయాలను స్వీకరించగా.. మెజారిటీ సభ్యులు సిట్టింగ్ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డికే ఓటు వేశారని సమాచారం.

ఇదే కారణం…

పంచాయతీ, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన కారణంగా మళ్లీ బొక్క నరిసింహా రెడ్డికే బీజేపీ పగ్గాలు ఇస్తారనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా జిల్లాలో పార్టీ సమన్వయంతో ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో అధ్యక్షుడి మార్పు విభేదాలకు దారితీస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story