- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగర ప్రజలకు శుభవార్త.. ఇవాళ..
దిశ, న్యూస్‌బ్యూరో: వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ)లో భాగంగా మరో ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ.26.45 కోట్లతో బైరామల్‌గూడ జంక్షన్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌ను నేడు (ఆగస్టు 10న) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఎస్ఆర్డీపీ ప్యాకేజీ–2లో భాగంగా రూ. 448 కోట్ల వ్యయంతో పనులను 14 పనులను చేపట్టడగా.. బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌తో కలిపి ఆరు పనులు పూర్తయ్యాయి. ఇతర పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
ప్యాకేజీ–2లో పూర్తయిన పనులు
ఎస్ఆర్డీపీ ప్యాకేజి-2లో 14 పనులను ప్రతిపాదించారు. భాగంగా ఇప్పటి వరకు ఎల్బీనగర్ జంక్షన్‌లో రూ.29.27కోట్లు, కామినేని జంక్షన్‌లో రూ.46.40కోట్లు, రూ. రూ.13.25కోట్లతో చింతల్‌కుంట జంక్షన్‌లో కలిపి ఐదు పనులు పూర్తి చేశారు. బైరామల్ గూడలో మొత్తం రూ.125.53 కోట్లతో పనులను ప్రతిపాదించారు. ఇందులో రూ.24.37 కోట్లతో నిర్మించిన కుడి వైపు ఫ్లైఓవర్‌కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. మరో రూ.24.23కోట్లతో నిర్మిస్తున్న ఎడమ వైపు ఫ్లైఓవర్ పనులు 35శాతం పూర్తయ్యాయి. సెకండ్ లెవల్ ఫ్లైఓవర్‌తో పాటు మరో రెండు ఇతర పనులకు ఇప్పటివరకూ గ్రౌండింగ్ కూడా పూర్తి కాలేదు.
పీక్ అవర్‌లో 18,653 వాహనాల రద్దీ
బైరామల్ గూడ జంక్షన్‌లో కుడి వైపు నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్‌పై మూడు లైన్లతో ఒన్ సైడ్ వేలో వాహనాలు ప్రయాణిస్తాయి. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే సాగర్‌రోడ్ జంక్షన్‌పై ఒత్తిడి తగ్గుతుండంతో పాటు సికింద్రాబాద్ నుంచి ఓవైసీ ఆస్పత్రి వైపు వచ్చే రూట్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఇంధన ఆదా, ప్రయాణ సమాయం మిగులుతోంది. ఇండియాలో మొదటిసారిగా కొత్త టెక్నాలజీతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రమాదాల తీవ్రతను తగ్గించేలా రూపొందించారు. 2015లో పీక్ అవర్‌లో ఈ రూట్లో 7,481 పీసీయూలు ప్రయాణిస్తుండగా.. 2034 నాటికి వీటికి సంఖ్య 18,653కు చేరనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ నగరంగా తీర్చిదిద్దుతాం: బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ మేయర్
హైదరాబాద్‌ను ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ నగరంగా మార్చేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, రోడ్డు విస్తరణ పనులను చేపడుతున్నాం. దేశంలోని మొదటిసారిగా కొత్త టెక్నాలజీతో బైరామల్‌గూడ్ ఫ్లైఓవర్‌ను నిర్మించాం. ఈ టెక్నాలజీ వల్ల ప్రమాదాల సంఖ్య, తీవ్రత తగ్గుతుంది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల ద్వారా సిటీలో రవాణా, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.