ఆన్‌లైన్‌‌లో వేములవాడ రాజన్న పూజలు

by Sridhar Babu |

దిశ, కరీంనగర్: రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇకమీదట ఆన్ లైన్‌లో అర్జిత సేవలు నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు.కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాల్సి వచ్చింది. దీంతో రాజన్న ఆలయంలో కేవలం అర్చకులు మాత్రమే నిత్య కైంకర్యాలు నిర్వహించేవారు. అయితే భక్తుల సౌకర్యార్థం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు.ఈ మేరకు భక్తులు గూగుల్ పే ద్వారా T app folio నుంచి పూజ చేయించుకోవాలనుకునే వారు బుకింగ్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్ లైన్‌లో అభిషేకం, అన్నపూజ, పత్రి పూజ, కుంకుమ పూజ, నిత్య కల్యాణం, మహా లింగార్చన, రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు ఇతరత్ర పూజలు, గోత్ర నామాలతో ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు అర్చకులు వివరించారు. ఇందుకోసం గూగుల్ పే ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు భక్తులకు సూచించారు.

tags ; vemulawada temple, online worship, t app folio facility

Advertisement

Next Story

Most Viewed