అమెరికా నుంచి ఫిర్యాదు.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు

by srinivas |
అమెరికా నుంచి ఫిర్యాదు.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు
X

దిశ, వెబ్ డెస్క్: అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇంతలో ఓ యువతి పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో ఇటు కుటుంబాన్ని.. అటు ప్రేయసిని పోషించడటం కష్టంగా మారింది. దీంతో అతను ఆన్‌లైన్ సెక్స్ బిజినెస్ మొదలు పెట్టాడు. ఈ బిజినెస్ మూడు పువ్వులు ..ఆరు కాయలుగా సాగింది. ఇంతలో అతనిపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో ఆన్‌లైన్ సెక్స్ బిజినెస్ గుట్టురట్టు అయింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అశ్విన్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజయనగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇంతలోనే ఓ యువతి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. కుటుంబాన్ని, ప్రేయసి పోషణ భారం కావడంతో ఆన్‌లైన్ సెక్స్ బిజినెస్ పెట్టాడు. కస్టమర్లతో ఫోన్‌లోనే డబ్బులు ట్రాన్స్‌పర్ చేయించుకునేవాడు. నెలకు దాదాపు రూ. 30 వేల పైనే సంపాదిస్తున్నాడు. కస్టమర్ల నుంచి డబ్బులు ట్రాన్స్‌పర్ చేయించుకుని వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసేవాడు. ఇలా మోసపోయిన నరేశ్ అనే వ్యక్తి అమెరికా నుంచి పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో అశ్విన్ సెక్స్ బిజినెస్ గుట్టురట్టు అయింది. చివరికి అశ్విన్, అతని ప్రియసి కటకటాలపాలయ్యాడు.

Advertisement

Next Story