- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనసాగుతున్న అల్పపీడనం.. మరో 3 రోజులు వర్షాలే..
by Anukaran |
X
దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళా ఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య, పశ్చిమ, మద్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర తీరానికి 7.6 కిమీ ఎత్తులో కొనసాగుతుందని వివరించింది. దీంతో నేడు కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురియనున్నాయని తెలిపింది. రేపు ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది.
ఆదిలాబాద్, కొమర భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదివారం అత్యధికంగా కొమరం భీం ఆసీఫాబాద్ జిల్లా దహేగాన్‌లో 52.2మిమీ, అత్యల్పంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 0.2మిమీ వర్షాపాతం నమోదైంది.
Advertisement
Next Story