Black fungus : కోఠీ ENT ఆస్పత్రికి కొనసాగుతున్న రద్దీ

by Shyam |   ( Updated:2021-05-25 06:38:27.0  )
Koti ENT Hospital2
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి బ్లాక్ ఫంగస్ (Black fungus) రోగుల రద్దీ కొనసాగుతోంది. ఆస్పత్రిలో ప్రస్థుతం 230 పడకలు ఉండగా 229 మంది రోగులు ఇన్ పేషంట్లుగా వైద్య చికిత్సలు పొందుతున్నారు. మంగళవారం 337 మంది రోగులు ఓపీ కి రాగా వీరిలో 11 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకున్నారు. 15 మంది బ్లాక్ ఫంగస్ రోగులకు శస్త్ర చికిత్సలు చేయడంతో ఇప్పటి వరకు చేసిన మొత్తం ఆపరేషన్ల సంఖ్య 65కు చేరింది. 5 గురిని డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా ఆస్పత్రిలో వైద్యం కోసం వంద మందికి పైగా రోగులు ఎదురు చూస్తున్నారు. వీరిలో కొంత మంది రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ అడ్మీషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఇలా వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసరమైతేనే ఇన్ పేషంట్లుగా చేర్చుకుంటున్నారు. ఇందుకోసం కొన్ని పడకలను అందుబాటులో ఉంచారు. మిగిలిన వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వారు ఏ రోజున వైద్యం కోసం రావాలో సమాచారం ఇస్తామని హాస్పిటల్ అధికారులు చెబుతున్నారు. అయినా కొంత మంది రోగులు, వారి సహాయకులు ఆస్పత్రి ఆవరణలో తమవంతు ఎప్పుడు వస్తుందా అని చెట్ల కింద, వాహనాలలో ఎదురు చూస్తున్నారు. సోమవారం కొంత మేర తగ్గిన ఓపీ తిరిగి మంగళవారం పెరగడం గమనార్హం.

Advertisement

Next Story