- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్సీ మీద ఎంత ‘శ్రద్ధ’?
జెర్సీ… గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన అద్భుత కావ్యం. అర్జున్ గా నాని… సారాగా శ్రద్ధ శ్రీనాథ్.. నానిగా చైల్డ్ ఆర్టిస్ట్ రోనిత్… కోచ్ గా సత్యరాజ్… ఈ నలుగురు సినిమాకు నాలుగు పిల్లర్స్. అర్జున్ అనారోగ్యం తన నిస్సహాయతకు దారి తీసి… భార్యచే చీ అనిపించుకున్నా… ప్రపంచం మొత్తం పనికిమాలిన వాడిగా చూసినా… తన కొడుక్కు మాత్రం తను హీరోగానే కనిపించాలన్న ఆశ… స్టార్ క్రికెటర్ నూ చేసింది. సచిన్ ప్లేస్ లో కొడుకు తన ఫోటో పెట్టుకునేలా చేసింది. కానీ అదే ఆట తన ప్రాణాలు తీస్తుందన్న విషయం తెలిసి కూడా… కేవలం కొడుకు కోసం… నువు క్రికెట్ ఆడితే బాగుంటుంది నాన్న… హీరోలా ఉంటావ్ అన్న మాట కోసం… మళ్లీ క్రికెట్ ఆడడం… ఇవన్నీ సగటు ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా కళ్ల ముందు కనబడుతూనే ఉంటాయి. కొడుక్కు జెర్సీ కొనివ్వలేని నిస్సహాయ స్థితిలో … భార్య పర్స్ నుంచి డబ్బులు కొట్టేసే స్థాయికి దిగజారడం… ఆమె ముందు దోషిలా నిలబడడం… ప్రతీ సీన్ హృదయాన్ని తొలిచేస్తోంది. సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా… ప్రేక్షకుల మదిలో ఈ సినిమా జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయి.
అవును… ప్రేక్షకులే కాదు నన్ను కూడా ఈ కథ తొలిచివేస్తుందని అంటుంది హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. ఎంతో అందంగా, అపురూపంగా మొదలైన అర్జున్, సారా ల లవ్ స్టోరలో… ఎనలేని ప్రేమ, గౌరవం, మద్దతు ఉంటుంది. ఒకరికోసం ఒకరు పోరాడెంత ప్రేమ వారి సొంతం. కానీ… అలా పెద్దలను ఎదిరించి పెల్లు చేసుకున్నాక ఏమి జరిగింది..? సారా కు అర్జున్ మీద కోపం పెరిగింది.. నమ్మకం పోయింది. కానీ నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను… సారా అర్జున్ డబ్బు అడిగినప్పుడు ఇస్తే బాగుండేది అని.. క్రికెట్ ఆడితే ప్రాణాలకు ముప్పు అన్న విషయాన్ని అర్జున్ దాచకుండా ఉండాల్సింది అని.. సారా అర్జున్ పట్ల ద్వేషాన్ని చూపించకుండా… సపోర్ట్ గా, దయగా ఉంటే బాగుండేది అని… అర్జున్ అన్ని విషయాలను పట్టించుకోకుండా కనీసం తన కొడుకు ఎదుగుదలను చూసేందుకు అయినా బతికుంటే బాగుండేది అని… కానీ ఇదేది జరగలేదు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం సారా, అర్జున్ లను అలా చేసిందేమో అనుకుంటూ ఉంటాను అని తెలిపింది శ్రద్ధ. కానీ సారా, అర్జున్ లు ఇంకా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు… నిలిచిపోతారు అని సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది శ్రద్ధ.
ఈ సందర్భంగా నాని చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పని గురించి తెలిపింది. తాను జ్వరంతో వణుకుతూ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు… తనకు తెలియకుండా ఫోటో తీసిన నాని. ఓసారి నీ ఫోన్ చూసుకోమని చెప్పాడట. చూస్తే… తన ఫోటోతో పాటు ఒక మెసేజ్ ఉందట. చాలా డెడికేషన్ తో పని చేస్తున్నవ్… ఈ సీన్ నీది… చంపేసెయ్ అని… నాని నిజంగా సో స్వీట్… ఒక గొప్ప కో యాక్టర్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. నీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.. నువు చేసిన, చేస్తున్న నటనకు, ఇందుకోసం పడుతున్న కష్టానికి ఏ అవార్డులు కూడా సరోపోవేమో అని తెలిపింది.
Tags: Jersey, Nani, Gowtam Tinnanuri, Shraddha Srinath, sathyaraj