పరుగులు తీసిన రోగుల్లో ఒకరు మృతి 

by Anukaran |
పరుగులు తీసిన రోగుల్లో ఒకరు మృతి 
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆక్సిజన్ లికవ్వడంతో రోగులు పరుగులు తీయగా ఆక్సిజన్ అందక రోగి మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డులో అకస్మాతుగా ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న పరిణామంతో భయాందోళనలకు గురైన రోగులు బయటకు పరుగులు తీశారు. తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత రోగులు తిరిగి లోపలికి వెళ్లారు.

అయితే గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామనికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి సోమవారం ఉదయం షుగర్ లేవల్ తగ్గడంతో అసుపత్రిలో చేరారు‌. అతనికి వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకైందని భయాందోళనకు గురైన కృష్ణయ్య సైతం బయటకి వచ్చి తిరిగి లోపలికి వెళ్లే లోపలే మృతి చెందినట్లు బందువులు తెలిపారు. చాలా మంది రోగులు వెంటిలేటర్ సెలైన్ బాటిల్ తో బయటకు వచ్చి చెట్ల కింద కూర్చున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడి చేరుకుని ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. సంఘటన స్థలాని సూపరింటెండెంట్ డాక్టర్ శోభారాణి, గద్వాల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పరిశీలించారు.

Advertisement

Next Story