JIO యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్.. ఒక్క రూపాయికే నెలంతా ఇంటర్నెట్

by Harish |   ( Updated:2021-12-15 08:33:31.0  )
Jio
X

దిశ, డైనమిక్ బ్యూరో : మొబైల్ యూజర్లకు ఆయా కంపెనీలు ధరలు పెంచుతూ షాకిస్తుంటే జియో మాత్రం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.1 కే రీచార్జ్ చేసుకునేలా జియో ప్రత్యేక ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూపాయి రీచార్జ్‌తో నెలరోజుల పాటు ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఇవ్వనుంది. అయితే ఈ ప్యాకేజీని వినియోగించి 100ఎంబీ ఇంటర్నెట్ బ్యాలెన్స్‌ను పొందవచ్చు. అంటే డేటా ప్యాక్ రూ.1 ని పదిసార్లు వినియోగించుకుంటే రూ.10తో దాదాపు 1జీబీ డేటాను పొందవచ్చు. ఇంటర్నెట్ డేటా అయిపోయిన సందర్భంలో ఈ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుందని యూజర్లు చెబుతున్నారు. అయితే ఈ ప్యాక్‌ను పొందాలంటే మొబైల్ యాప్‌ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది

చదవండి :

వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌లోనే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్!

ఫ్రీ గా మూడు సిలిండర్లను ఇస్తున్న Paytm

Advertisement

Next Story