- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకటే ఛార్జర్.. ఐదు పరికరాలు
దిశ, వెబ్‌డెస్క్ :
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కనీసం నాలుగు మొబైల్ ఫోన్లు కచ్చితంగా ఉంటున్నాయి. నాలుగు ఫోన్లకు నాలుగు వేర్వేరు చార్జర్లు ఉన్నప్పటికీ అత్యవసర సమయాల్లో ఇంట్లో పవర్ బోర్డు ఉండకపోవచ్చు. ఇక ఎక్కడికైనా పర్యటనకు వెళ్లినపుడు కారులో అందరికీ ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం రాకపోవచ్చు. కానీ ఇక ఆ సమస్య ఉండదు. కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన ఫ్యామిలీ ఛార్జర్‌తో ఒకేసారి ఐదు ఎలక్ట్రానిక్ వస్తువులకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఇప్పటికే మార్కెట్లో కొన్ని యూఎస్‌బీ అనుసంధాన ఛార్జర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఒకేసారి ఎక్కువ మంది ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అన్ని పరికరాలు ఒకే మొత్తంలో విద్యుత్ సరఫరా ఉండదు. దీని వల్ల ఛార్జింగ్ అడాప్టర్ త్వరగా పాడైపోతుంది. కొన్నిసార్లు ఫోన్లు విపరీతంగా వేడెక్కె అవకాశం ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఛార్జర్ అలా కాదు. ఏ పరికరానికి ఆ పరికరానికే ప్రత్యేకంగా 12 వాట్ల విద్యుత్‌ను ఇవ్వగలుగుతుంది. అంతేకాకుండా దీని వైరు కూడా పొడవుగా ఉండటంతో దూరం కూడా పెంచుకోవచ్చు. ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో 75 డాలర్లకు అందుబాటులో ఉన్న ఈ ఛార్జర్ త్వరలో భారత మార్కెట్లోకి కూడా రానుంది.
Read also..