రికార్డు స్థాయిలో బంగారం ధర!

by Harish |
రికార్డు స్థాయిలో బంగారం ధర!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు పది గ్రాములు రికార్డు స్థాయిలో రూ. 43 వేలను దాటాయి. అంతర్జాతీయ ధరలు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న నేపథ్యంలో మదుపర్లు బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపుకు మళ్లారు.

కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగరం ఫ్యూచర్స్ రూ. 433 పెరిగి పది గ్రాములకు రూ. 43,099 గా ఉంది. వెండి సైతం బంగారం బాటలోనే కిలోకు 0.58 శాతం పెరిగి రూ. 48,585 వద్ద త్రేడవుతోంది. చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్ లాంటి దేశాల్లో కరోనా వైరస్ పెరగడంతో బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఆర్థిక పునరుద్ధరణను ప్రమాదంలో పడేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్‌కు ఏడేళ్ల గరిష్ఠానికి పెరిగి 1,679.58 డాలర్లకు చేరుకుంది. లంచ్‌కి ముందు బంగారం రూ. 394 పెరగడంతో అధికంగా పది గ్రాముల బంగారం రూ. 43,060 వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం బంగారం బాటలోనే కిలో రూ. 48,600 వద్ద కొనసాగుతోంది. దేశీయ ఎమ్‌సీఎక్స్‌లో బంగారం ధర రూ. 43 వేలకు చేరుకోవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రూ. 1,663 వద్ద ట్రేడవుతోంది.

Read Also..

‘భారత సంపద కొల్లగొట్టేందుకే ట్రంప్ పర్యటన’

Advertisement

Next Story