- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూకేలో ఒమిక్రాన్ తొలి మరణం.. ఆందోళనలో అధికారులు
లండన్: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తోన్న కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్‌తో తొలి మరణం యూరోప్‌లో సంభవించింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఒమిక్రాన్ బారిన పడిన ఓ వ్యక్తి మరణించారని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న డెల్టాతో పోలిస్తే తేలికపాటిగా పేర్కొంటున్న ఈ వేరియంట్‌తో మరణం నమోదు కావడం, ఆందోళనలను తీవ్రతరం చేస్తుంది.
అయితే వైరస్ మధ్యస్థ లక్షణాలను మనం కేవలం ఒక వైపుకు మాత్రమే పరిమితం చేయాలి. వైరస్ వ్యాపిస్తున్న వేగాన్ని బట్టి మనం అంచనా వేయాలి’ అని అన్నారు. ఓ వైపు డెల్టా వేరియంట్ తీవ్రంగా ఉన్న యూరప్‌లో, ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా అత్యధికంగా ఉంది. ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. లండన్‌లో 40 శాతం ఇన్ఫెక్షన్లకు కారణమైందని వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా రెండు డోసులు తీసుకున్న వారంతా బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రస్తుతం యూకే ఒమిక్రాన్ కేసులు 3వేలకు పైగా నమోదు కాగా, ఆదివారం ఒక్కరోజే భారీగా 1,239 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు. కాగా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వేరియంట్ వైరస్ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా డెల్టా వేరియంట్ కన్నా 3 రెట్లు వేగంగా వ్యాపించే లక్షణాలు కలిగి ఉందని తెలిపింది. తాజా వేరియంట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా దేశాలకు వ్యాపించింది.