- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒలంపిక్ జ్యోతి ర్యాలీపై స్పష్టత
దిశ, స్పోర్ట్స్ : మరో ఆరు నెలల్లో వాయిదా వేసిన టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మెగా క్రీడలకు ముందు ఒలంపిక్ జ్యోతిని ర్యాలీగా తిప్పడం ఆనవాయితి. ఇప్పటికే జపాన్ చేరుకున్న ఒలంపిక్ జ్యోతిని.. క్రీడలు వాయిదా పడటంతో నిర్వహణ కమిటీ తమ కార్యాలయంలో ఉంచింది. కాగా, ఈ సారి ఒలంపిక్ జ్యోతి ర్యాలీ ఉంటుందో లేదో అనే సందేహాల నడుమ నిర్వహణ కమిటీ స్పష్టతను ఇచ్చింది. మార్చి 25 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ ఒలంపిక్ ర్యాలీని నిర్వహిస్తామని ప్రకటించింది.
ఫుకోషిమాలోని జే-విలేజ్ సాకర్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ దేశంలోని 47 ప్రాంతాల గుండా ప్రయాణించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా జపాన్‌లోని 47 ప్రిఫెక్చర్స్ (జిల్లాలు)లో వేర్వేరుగా కరోనా నిబంధనలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహించనున్నారు. ఒలంపిక్ జ్యోతి ప్రయాణం పబ్లిక్ రహదారులకు దూరంగా ఉంటుందని తెలిపింది. 121 రోజుల పాటు దేశమంతా ప్రయాణించిన తర్వాత చివరకు ఒలంపిక్స్ జరిగే టోక్యోకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.