వృద్ధురాలు దూకింది.. కానిస్టేబుల్ కాపాడాడు!

by srinivas |
వృద్ధురాలు దూకింది.. కానిస్టేబుల్ కాపాడాడు!
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వృద్ధురాలు కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ వెంటనే కాల్వలోకి దూకి ఆమె ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అజిత్ సింగ్ నగర్-రామకృష్ణాపురం మధ్యలోని బుడమేర కాల్వలోకి 60 ఏళ్ల వృద్ధురాలు అప్పుల బాధలు భరించలేక దూకింది. సమాచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు ఘటనా స్థలానికి చేరుకుని కాల్వలోకి దూకి వృద్ధురాలని రక్షించారు.

Advertisement

Next Story