‘ఓ ఉమెనియా’ ట్రెండింగ్

by Jakkula Samataha |
‘ఓ ఉమెనియా’ ట్రెండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై రాములమ్మగా, బిగ్ బాస్ 3లో రోరింగ్ ఉమెన్‌గా తనదైన ముద్ర వేసింది. పటాస్ షో ద్వారా ప్రతీ ఒక్కరి ఫ్రెండ్ అయిపోయిన శ్రీముఖి ఎనర్జీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. యాంకరింగ్‌ స్కిల్స్‌కు అమేజింగ్ అనాల్సిందే. బిగ్ బాస్ రియాలిటీ షో కోసం పాపులర్ షో పటాస్‌ నుంచి తప్పుకున్న శ్రీముఖి.. బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ సూపర్ సక్సెస్‌ అందుకుంటోంది. సరికొత్త ప్రయోగాలు చేయడం.. వాటిని సక్సెస్ చేయడంలో ది బెస్ట్ కాబట్టి.. మరో సరికొత్త ఆలోచనతో వచ్చేసింది.

మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఓ ఉమెనియా’ అంటూ తెలుగు టాక్ షోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మహిళలూ.. పండగ చేసుకుందాం అంటున్న శ్రీముఖి.. బ్యూటీ, లవ్, పాషన్, ఫన్ అండ్ గ్లామరస్ టచ్‌తో కిక్ ఇచ్చే ఎంటర్‌టైన్మెంట్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రోమో రిలీజ్ కాగా, అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఒక్కరోజులోనే నాలుగున్నర లక్షల వ్యూస్ సొంతం చేసుకోవడమే కాదు బిగ్ స్టార్స్ నుంచి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది.

‘ఓ ఉమెనియా’ ప్రోమో కాన్సెప్ట్‌కు యామిని ఘంటసాల అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుండగా.. ఆనీ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. వీటికి శ్రీముఖి స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా తోడు కావడంతో ఫస్ట్ లుక్ ప్రోమో.. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ షోను శ్రీముఖి ప్రొడ్యూస్ చేస్తుండగా.. కేవలం మహిళల కోసమే డిజైన్ చేసిన షో.. తన యూట్యూబ్ చానల్‌లో టెలికాస్ట్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్టే ట్యూన్ అంటున్న యాంకర్ శ్రీముఖి.. ‘ఫీల్ ఇట్ అండ్ రీల్ ఇట్’.. డెఫినెట్లీ ఐ లవ్ ఇట్’ అంటూ ఫాలోవర్స్‌ను రిక్వెస్ట్ చేస్తోంది. మహిళలూ.. త్వరలో స్టార్ట్ కాబోయే ఓ ఉమెనియా షోను సూపర్‌గా ఎంజాయ్ చేయండి.. ఆల్ ది బెస్ట్ శ్రీముఖి.

Advertisement

Next Story

Most Viewed