- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవో జారీ చేసినా.. అధికారిక ప్రకటన రాలేదు.. ఆంతర్యమేంటీ..?
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది.. వాస్తవానికి ఈనెల 13న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయగా.. ఆలస్యంగా ఇందుకు సంబంధించిన సమాచారం అధికార వర్గాలకు తెలిసినట్లు సమాచారం. ప్రభుత్వం జారీ చేసిన జీవోను పరిశీలిస్తూ ఇదే విషయం స్పష్టమవుతోంది. ఆజం జాహి మిల్లు స్థలంలో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ స్థలాన్ని నిర్మించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎందుకనో మూడు రోజులు గడిచిన అధికార వర్గాలు ప్రకటించకపోవడం గమనార్హం.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేపట్టిన జిల్లాల పునర్విభజనలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే రూరల్‌కు జిల్లా కేంద్రాన్ని చూపకపోవడంతో దాదాపు ఆరేళ్లుగా హన్మకొండ కేంద్రంగానే పాలన సాగింది. అయితే నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ వరంగల్- హన్మకొండ జిల్లాల పునర్విభజన చేసిన విషయం తెలిసిందే.
15 మండలాలతో వరంగల్, 14 మండలాలతో హన్మకొండ జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ స్పష్టత వచ్చిన నాటి నుంచి హన్మకొండ కలెక్టరేట్‌కు ధీటుగా వరంగల్ కార్యాలయాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. అప్పటి నుంచి అన్వేషణ సాగించిన అధికారులు, ప్రజాప్రతినిధులు చివరికి ఆజాం జాహి మిల్లు స్థలాన్నే ఫైనల్ చేశారు.
- Tags
- collectorate