- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడి కూసినందుకు రూ. 15 వేలు ఫైన్
దిశ, వెబ్‌డెస్క్: కోడి కూసిన పాపానికి సదరు యజమానికి రూ. 15 వేల ఫైన్ విధించారు. సాధారణంగా కోడి కూతకు జనాలు లేచి వారి వారి పనుల్లో నిమగ్నం అవుతారు. కానీ, అక్కడ కోడి కూసి నిద్రను పాడు చేసిందంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోడిని పెంచుకుంటున్న యజమానికి అధికారులు రూ. 15 వేలు ఫైన్ విధించారు.
వివరాళ్లోకి వెళితే.. ఇటలీలోని కాస్టిరగా విదార్దో నగరంలో ఓ పెద్దాయన కోడిని పెంచుకుంటున్నాడు. అయితే, అక్కడ పెంపుడు జంతువులు, పక్షులు పెంచుకునే వారు పక్కింటి వారికి కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలి. అయితే, ఆ పెద్దాయన ఇంటి పక్కన్నే చాలా ఇండ్లు ఉన్నాయి. అయినా అతడు ఓ కోడిని కొని పెంచుకుంటున్నాడు.
అయితే, కోడి రోజు ఉదయాన్నే తన కూతతో అందరినీ నిద్రలేపుతోంది. ఉదయం 4.30 నుంచి మొదలెడుతే 6 గంటల వరకు కోడి కూతతో కాలనీ మారుమోగుతోంది. దీంతో లేట్ నైట్ ఇంటికొచ్చి నిద్ర పోతున్నావారికి చాలా ఇబ్బందిగా మారింది. ఇదే విషయం ఆ పెద్దాయనకు చెప్పి చూశారు. కోడిని దూరంగా పెట్టమని ఆయనతో వాదించారు. అయినప్పటికీ సదరు యజమాని వినిపించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడికి ఫైన్ వేసినట్టు ఆ నగర మేయర్ స్పష్టం చేశారు.