బిగ్ బ్రేకింగ్ : హుజురాబాద్‌కు 200 మంది అధికారులు.. అందుకేనా..?

by Sridhar Babu |   ( Updated:2021-08-25 05:43:00.0  )
KCr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు లబ్దిదారుల జాబితా ఆధారంగా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రక్రియను శుక్రవారం నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా లబ్దిదారుల నుండి పూర్తి వివరాలు సేకరించనున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులను ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం డిప్యూటేషన్ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం నుండి వచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని 200 మందికి తొలి విడుత లబ్ది చేకూర్చడంలో భాగంగానే ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ చేపడుతున్నట్టు సమాచారం.

48 అంశాలపై..

దళిత బంధు స్కీం లబ్దిదారుల నుండి మొత్తం 48 అంశాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించే అధికారులు వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇందులో వారి కుటుంబ సభ్యుల వివరాలు, లబ్దిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారం నుండి వచ్చే ఆదాయం, ఖర్చు, నికర ఆదాయం ఎంత ఉంటుందో కూడా తెలుసుకోవాల్సి ఉంది. నెల వారీగా ఆ కుటుంబ సభ్యులు వెచ్చించే ఖర్చు ఎంత, ఆహారం, ఇతరాత్ర అవసరాల వివరాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులు, ప్రధాన ఆరోగ్య సమస్యలు, ఇందు కోసం ఏదైనా పథకం ద్వారా లబ్ది పొందారా అన్న పూర్తి వివరాలను కూడా సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం మొత్తం 48 అంశాల గురించి క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ చేసే యంత్రాంగం సేకరించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed