HariHara VeeraMallu : హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న స్టార్ రైటర్..!

by Prasanna |
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న స్టార్ రైటర్..!
X

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ ఎప్పుడో రావాల్సింది. కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా మారడం వలన ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం, షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే, మూవీ లేట్ అవ్వడంతో చాలా మంది తప్పుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్ అయిన డైరెక్టర్ క్రిష్ కూడా ఈ మూవీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ నిర్మాత అయిన ఏఎం రత్నం తనయుడు, డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే, క్రిష్ ఎందుకు తప్పుకున్నాడో ఇంత వరకు కారణం ఏంటనేది బయటకు రాలేదు. తాజాగా స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ కూడా హరిహర వీరమల్లు మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు.

గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. " నేను కూడా హరిహర వీరమల్లు మూవీకి వర్క్ చేయడం లేదు. డైరెక్టర్ క్రిష్ తో పాటే నేను కూడా బయటకు వచ్చేసాను. కానీ, మూవీ అద్భుతంగ ఉంటుంది. మీ అందరి లాగే నేను కూడా ఆ మూవీ కోసం ఎదురుచూస్తున్నాను" అని తెలిపారు.

Advertisement

Next Story