- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సుప్రీం చీఫ్ జస్టిస్‌గా ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం
దిశ, వెబ్ డెస్క్: భారత 48వ సీజేఐగా తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీరమణ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, నేటి నుంచి 2022 ఆగస్టు 26 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవిలో కొనసాగనున్నారు.
కుటుంబ నేపథ్యం…
జస్టిస్ ఎన్వీ రమణ స్వస్థలం కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నకరం గ్రామం. ఇతను సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1957 ఆగస్టు 27న జన్నించారు. కృష్ణాజిల్లా కంచికచర్లలో జస్టిస్ ఎన్వీ రమణ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అమరావతిలోని ఆర్ వీవీఎన్ కాలేజీలో బీఎస్సీ పట్టా పొందారు. 1982లో నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్2లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు