- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అతని నుంచి విముక్తి కలిగించినందుకు ధన్యవాదాలు.. నుస్రత్
దిశ, సినిమా: కోల్‌కతా లోకల్ కోర్టు సినిమా యాక్టర్, ఎంపి నుస్రత్ జహాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏకకాలంలో రాజకీయం, సినిమా రంగంలో రాణిస్తోన్న బెంగాలీ బ్యూటీ వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. 2019 జూన్‌లో టర్కీ దేశ చట్టాలకు అనుగుణంగా నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకున్న ఆమె.. పలు కారణాల వల్ల ఆ బంధం నుంచి విముక్తి కోరుకుంటుంది. ఈ క్రమంలో ‘టర్కీలో జరిగిన వివాహం ఇండియాలో లీగల్ కాదు. మనదేశ చట్టం ప్రకారం ఏ మతపరమైన ఆచారాన్ని అనుసరించి జరగలేదు.
వారి ఏకాభిప్రాయ సంబంధాన్ని పెళ్లిగా పరిగణించలేము’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పుపై స్పందిస్తూ.. ‘నిఖిల్‌తో వివాహ బంధం నుంచి వైదొలగాలనుకుని ప్రిపేర్ అయిన తర్వాత మా వివాహాన్ని రద్దు చేయాలని మార్చిలో కోర్టును ఆశ్రయించాను. ఇన్నాళ్లకు కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చినందుకు సంతోషిస్తున్నా. సంక్లిష్ట సంబంధం నుంచి నాకు విముక్తి కలిగించినందుకు ధన్యవాదాలు’ అని తెలిపింది. ఇక వివిధ కారణాలతో నిఖిల్ జైన్ నుంచి విడిపోయిన నుస్రత్ జహాన్.. ప్రస్తుతం బెంగాలీ నటుడు యశ్ దాస్‌గుప్తాతో రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
- Tags
- court