- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెంబర్ ప్లేట్లను మార్చి.. పోలీసులను ఏమార్చి
దిశ, న్యూస్ బ్యూరో: మోటార్ వెహికల్ చట్టం సవరించిన తర్వాత వాహనదారులకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై వడ్డింపు కూడా పెరిగింది. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్.. సహా అన్ని రకాల ఉల్లంఘనలకు రూ.1,000 తగ్గకుండా ఫైన్ విధించే అవకాశం కలుగుతోంది. తాము నిబంధనలు ఉల్లంఘించినా సరే.. తమకు ఫైన్ పడకూడదని భావించిన వాహనదారులు నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారు. నెంబర్ ప్లేట్లను వంచడం, బట్టలతో కట్టడం, ఏదో ఒక నెంబర్‌ను తొలగించడం లేదా మార్చడం వంటివి చేస్తున్నారు. జరిమానాలు తప్పించుకోవడం మాట ఎలా ఉన్నా రోడ్లపై ఇలాంటి వారితో నిత్యం ఇతరులకు ఇబ్బందులు తప్పడం లేదు. నేరస్థులు నెంబర్ ప్లేట్లను దుర్వినియోగం పరచడంతో పాటు పూర్తిగా తొలగిస్తే వారిని పట్టుకోవడం తీవ్ర సమస్యగా మారనుంది.
కేసు దర్యాప్తుల్లో నెంబర్ కీలకం..
ఇటీవల ఎల్‌బీనగర్ జోన్ పరిధిలో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసులో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. చైన్ స్నాచర్లు ఉపయోగించిన బైక్‌కు నెంబర్ ప్లేట్ లేనట్టు బాధితురాలు గుర్తించింది. చైన్‌స్నాచర్లు, రోడ్లపై ఇబ్బందులు కలిగించే ఆకతాయిలు, ఇతర తీవ్ర నేరాల్లోనూ కేసు దర్యాప్తుల్లో వెహికల్ నెంబర్ కీలకంగా మారుతుంది. అడ్రస్‌ను తెలుసుకుని నిందితులను త్వరగా పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సిటీలో చైన్ స్నాచింగ్ కేసులు, చిల్లర దొంగతనాలు ఎక్కువే. అందిన ఫిర్యాదుల్లో కీలక సాక్ష్యాలపై పోలీసులు అంతగా దృష్టి సారించినట్టు కనిపించడం లేదు. చాలా సిగ్నల్ పాయింట్ల వద్ద మాన్యువల్‌గా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సిగ్నళ్లను కంట్రోల్ చేస్తున్నారు. సిగ్నల్ జంపింగ్‌లు సహా ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలు తక్కువేమీ కాదు. ముఖ్యంగా సీసీ కెమెరాల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా ట్యాంపరింగ్ చేస్తున్నారు. పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌ల ద్వారా ఆదాయంపై ఉన్నంత శ్రద్ధ నెంబర్ ప్లేట్లపై సారించడం లేదు. నెంబర్ ప్లేట్ల ద్వారా నేరపరిశోధన సులభమవుతుందని తెలియనిది కాదు. కానీ, ఎందుకో మరి వారంత శ్రద్ధ చూపనట్టు తెలుస్తుంది. ఏదో ఆకతాయిలు ట్రాఫిక్ ఛలాన్లను తప్పించుకునేందుకు చేస్తున్నారని భావిస్తున్నారోమో.. తీవ్రనేరాలకు పాల్పడినపుడు ఆ తీవ్రత, దర్యాప్తులో ఆలస్యాన్ని గుర్తించి నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ సమస్యను పోలీసులు అర్థం చేసుకోవాలి.
నెలకు 2వేల కేసులు..
నెంబర్ ప్లేట్ సరిగాలేని వాహనదారులు ఇతరులకు ఇబ్బంది కలిగించడం సిటీలో నిత్యం కనిపించే దృశ్యాలే. సిగ్నల్ జంప్ చేసి వెళ్లేటపుడు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. గత నెలలో ట్యాంక్‌బండ్‌పై రాత్రి సమయంలో మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాద ఘటన సోషల్ మీడీయాలో వైరల్ అయింది. నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేసిన ఆకతాయిలు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇతర వాహనాల ముందు ఫీట్లు చేయడం, ఓవర్ స్పీడ్‌తో ఇష్టారీతిగా వ్యవహరించడం వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. చిల్లర నేరాలకు పాల్పడేవారికి ఇదొక పాజిటివ్ అంశంగా కనిపిస్తోంది. గతంలోనూ రెండు వేర్వేరు కార్లకు ఒకే నెంబర్ ప్లేట్ ఉన్న విషయాన్ని ఆ కారు యజమాని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అసలు నెంబర్ ఫార్చూనర్ కారుకు ఉంటే అదే నెంబర్ ఉన్న హ్యూండాయ్ కారుపై పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్లు వేశారు. ఇలాంటి ఘటనలను పరిశీలిస్తే.. అలా నెంబర్ ప్లేట్లను దుర్వినియోగపరిచినపుడు అసలు నేరస్థులు తప్పించుకోవడంతో పాటు అమాయకులు ఇబ్బందులు పడుతారు. నెంబర్ ప్లేట్లపై చర్యల కోసం ప్రతి నెలా ఒక వారం రోజులు మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్న పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. నెలకు సగటున రెండు వేలకు తగ్గకుండా నెంబర్ ప్లేట్ల దుర్వినియోగం కేసులు నమోదవుతున్నట్టు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. అయినా రోడ్లపై నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ చేస్తున్న వాహనదారులు తగ్గడం లేదు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ వాహనాలు కనిపిస్తే 9490616555 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారమందించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.
నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిందే..
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం.. వ్యవహరించకపోతే మీతో పాటు మీ పక్కన ఉండే వాహనదారులకు ఇబ్బందులు తప్పవు. చట్టాలు ప్రజల రక్షణ కోసమేననే విషయాన్ని గుర్తించి నిబంధనలు పాటించండి. ఒక సర్వే ప్రకారం ఏడాదిలో యుద్ధాల ద్వారా ఏడాదిలో మరణించే సైనికుల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్యే అధికం. హెల్మెట్ లేకపోయినా.. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ప్రమాదాల పాలయితే ఎన్ని కుటుంబాలు, వ్యక్తుల భవిష్యత్ అంధకారంగా మారనుందో గమనించండి..
tags : Traffic, challan, road, accident,