సవాల్ చేసి చౌరస్తాకు వచ్చాం.. ఎంపీ అర్వింద్ ఎక్కడ

by Shyam |
NUDA chairman Prabhakar Reddy
X

దిశ, నిజామాబాద్ సిటీ: మూడ్రోజుల కింద ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరితే నేటికీ పత్తాలేడని, ఆయనకు చర్చించే దమ్ము, ధైర్యం లేదని, అందుకే చర్చలకు రాలేదని నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున ఢిల్లీ పెద్దలను కలిసి, రాష్ట్రానికి తగినంత వ్యాక్సిన్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ వ్యాక్సిన్ హబ్‌గా మారిందని, ప్రపంచ దేశాలకు ఇక్కడినుంచే వ్యాక్సిన్ సరఫరా అవుతోందని అన్నారు. ముందు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్ సరఫరా చేసి, బయట దేశాలకు పంపాలని కేంద్రానికి సూచించారు. ఇప్పటికైనా.. ఒక ఎంపీగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణలో వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూడా డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, అక్బర్ ఖాన్, ఏనుగందల మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story