తారక్ హోలి సెలబ్రేషన్స్ వైరల్

by Shyam |
తారక్ హోలి సెలబ్రేషన్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు హోలి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హోలి సంబరాలు జరుపుకుంటున్న తారక్… ఫ్యామిలీ ఫోటో షేర్ చేశాడు. తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి, ఇద్దరు అబ్బాయిలు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కలర్ ఫుల్‌గా, హ్యాపీనెస్‌తో నిండిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా ఎన్టీఆర్ .. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీంగా నటిస్తుండగా… ఒలివియా మోరిస్ తారక్‌కు జోడిగా కనిపించనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Tags: NTR, Holi, Family Celebration, Holi Celebration, RRR, SS Rajamouli, Ram Charan Teja

Advertisement

Next Story

Most Viewed