సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తారక్

by Shyam |   ( Updated:2020-05-02 00:53:20.0  )
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తారక్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్… దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న RRR మూవీతో పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడు. ఈ సినిమాలో కొమురం భీమ్ గా కనిపించబోతున్న తారక్… తన 30వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. అయినను పోయి రావలె హస్తినకు సినిమా టైటిల్ గా ఖరారైనట్లు తెలుస్తుండగా .. రాజకీయం నేపథ్యంలో చిత్రం సాగనుంది.

అయితే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లక ముందే తారక్ 31వ సినిమా పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీకి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న సినిమాలో విలన్ రణ్ వీర్ సింగ్ అని సమాచారం. ఈ వార్తతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మొత్తానికి తారక్ భవిష్యత్తులో పాన్ ఇండియా స్టార్ గా నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదించ బోతున్నాడు అన్న మాట.

Tags: NTR, RRR, Sanjay Leela Bhansali, SS Rajamouli, Trivikram Srinivas

Advertisement

Next Story