గోదావరిఖని ఆ పార్టీ ఆఫీసులో బీభత్సంగా తన్నుకున్న నేతలు..!

by Sridhar Babu |
congress
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన్నుకున్న నియోజకవర్గ NSUI విద్యార్థి సంఘం నాయకులపై అధిష్టానంతో పాటు నియోజకవర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఆరా తీసినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తూ పార్టీ క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇలాగే పార్టీ కొందరు లీడర్లు కార్యాలయంలోనే తన్నుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు నాయకులు మండిపడుతున్నారు. దీంతో తన్నుకున్న ఇద్దరు నాయకులపై వేటు వేసేందుకు ఇతర విద్యార్థి సంఘం నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story