ఈటల జాగ్రత్తగా ఉండాలని ఎన్‌ఆర్ఐ‌ల సూచన

by Shyam |
ఈటల జాగ్రత్తగా ఉండాలని ఎన్‌ఆర్ఐ‌ల సూచన
X

దిశ, హుజురాబాద్: భవిష్యత్తు కార్యాచరణ అందరి అభిప్రాయానికి అనుగుణంగానే ఉంటుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం అమెరికా ఎన్ఆర్ఐల ఫోరం ప్రతినిధులతో ఆయన జూమ్ మీటింగ్‎లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. రాజకీయ విషయంలో అన్ని వర్గాలతో చర్చిస్తానన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు తనకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ఆర్ఐల అండదండలు నిరంతరం అందించాలని కోరారు. సిట్టింగ్ జడ్జీలతో తన మొత్తం వ్యాపారం మీద సంపాదించిన ఆస్తుల మీద విచారణ చేయించండి అని సీఎంని కోరినట్లుగా ఆయన ఎన్‌ఆర్‌ఐలకు గుర్తు చేశారు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడనని ఈటల మరోసారి స్పష్టం చేశారు. తనకు మద్దతు తెలిపిన ప్రవాస భారతీయులకు ఈటల ధన్యవాదాలు తెలియజేశారు.

రాజీనామా చేసేటప్పుడు జాగ్రత్త..

జూమ్ మీటింగ్‎లో ఓఎన్ ఆర్ఐ మాట్లాడుతూ… ఎమ్మెల్యేగా రాజీనామా చేసేప్పుడు అన్ని రకాలుగా ఆలోచించుకున్న తరువాతే చేయాలని ఓ ఎన్ఆర్ఐ సూచించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా పట్టు బిగించి ఓటమి కోసం ప్రత్యేక ప్రణాళికలు వేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో బై ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి.. తదితర విషయాలను తెలుసుకుని ప్రభుత్వానికి నెల రోజుల కన్నా ఎక్కువ సమయం ఇవ్వవద్దని సలహా ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రం ఒకటే అన్నట్టుగా వ్యవహరిస్తున్నందున ఏ పార్టీలో చేరకుండా సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఏది ఏమైనా ఈటలకు అన్నివిదాలుగా అమెరికా ఎన్ఆర్ఐల ఫోరం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed