కరోనా జీవాయుధమే.. అంటున్న పాత నవల

by sudharani |

చైనా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఆ దేశం తయారు చేసిన జీవాయుధమేనని వస్తున్న వార్తలను నలభై ఏళ్ల క్రితం ప్రచురితమైన ఓ నవల బలపరుస్తోంది. ది ఐస్ ఆఫ్ డార్కెనెస్ అనే పేరుతో 1981లో డీన్ కూంట్జు అనే రచయిత రాసిన నవలలో ఉన్న ఒక చిన్న పేరా ఇప్పుడు నెట్లో హల్‌చల్ చేస్తోంది. 39వ అధ్యాయంలో వుహాన్ దగ్గర ఉన్న ఓ చైనా రహస్య మిలిటరీ పరిశోధన కేంద్రంలో ఒక జీవాయుధాన్ని తయారుచేసే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని, ఆ వైరస్‌కి వుహాన్ 400 అని పేరు కూడా పెట్టినట్లు ఆ నవలలో ఉంది.

అయితే దీని గురించి నెటిజన్లు స్పందిస్తూ.. ప్రపంచంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన, ఏదో ఒక పుస్తకంలో కథతో లింకు కలపడం బాగా అలవాటైందంటూ చురకలు అంటించారు. అంతేకాకుండా కరోనా వైరస్ గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ముందే చెప్పినట్లుగా వచ్చిన వార్తలను పోస్టు చేస్తూ.. భారతీయులు మీకంటే ముందున్నారని చైనీయులను ఆటపట్టించారు. ఒకవేళ నిజంగా కరోనా వైరస్, చైనా తయారు చేసిన జీవాయుధం అయ్యుంటే దాని వల్ల వాళ్లకే నష్టం జరిగిందంటూ మరికొంతమంది గుర్తుచేశారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ బారిన పడి చైనాలో 1800కి పైగా మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed