- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జకోవిచ్
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే జకోవిచ్ అడ్డాగా మారిపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ హ్యాట్రిక్ టైటిల్ నెగ్గడమే కాకుండా.. 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకొని అన్ని సార్లూ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం రాడ్ లెవర్ అరేనాలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్‌తో జరిగిన ఫైనల్‌లో 7-5, 6-2, 6-2 తేడాతో విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. తొలి సెట్‌లో జకోవిచ్‌తో హోరాహోరీగా తలపడిన మెద్వెదేవ్.. ఆ సెట్ కోల్పోయాక ఇక తిరిగి కోలుకోలేదు. జకోవిచ్ అతి సునాయాసంగా మిగిలిన రెండు సెట్లను కూడా గెలుచుకున్నాడు. ఆ సమయంలో మెద్వెదేవ్ పలుమార్లు తన కోచ్ వైపు చూస్తూ.. ‘నేనేమీ చేయలేక పోతున్నా’ అని అనడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విజయంతో జకోవిచ్ ఖాతాలో 18 గ్రాండ్‌స్లామ్స్ వచ్చి చేరాయి. జకోవిచ్ కంటే ముందు రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ చెరి 20 గ్రాండ్‌స్లామ్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. జకోవిచ్ ఇదే ఫామ్ కొనసాగిస్తే వారి రికార్డును బద్దలు కొట్టడం కష్టమేం కాదు.
గత 10 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో ఆరింటిని జకోవిచ్ గెలుచుకున్నాడు. ఈ విజయంతో మార్చి 8 వరకు జకోవిచ్ తన నెంబర్ 1 ర్యాంకులోనే కొనసాగుతాడు. దీంతో 311 వారాలు టాప్ ర్యాంకర్‌గా కొనసాగిన ఫెదరర్ రికార్డును కూడా బద్దలు కొట్టబోతున్నాడు. జకోవిచ్‌కు ఇది 28వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. జకోవిచ్ కంటే ముందు 31 ఫైనల్స్‌తో ఫెదరర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఫైనల్‌కు ఇలా :
1వ రౌండ్ – జే. చార్డీపై 6-3, 6-1, 6-2
2వ రౌండ్ – ఎఫ్. టిఫాపై 6-3, 6-7(3-7), 7-6(7-2), 6-3
3వ రౌండ్ – టి. ఫ్రిట్జ్‌పై 7-6 (7-1), 6-4, 3-6, 4-6, 6-2
4వ రౌండ్ – ఎం. రోనిక్ 7-6(7-4), 4-6, 6-1, 6-4
క్వార్టర్ ఫైనల్ – ఏ. జ్వెరెవ్ 6-7(6-8), 6-2, 6-4, 7-6(8-6)
సెమీఫైనల్ – ఏ. కరత్సెవ్ 6-3, 6-4, 6-2
ఫైనల్ – డానిల్ మెద్వెదేవ్ 7-5, 6-2, 6-2
గ్రాండ్ స్లామ్ టైటిల్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ : 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021
వింబుల్డన్ : 2011, 2014, 2015, 2018, 2019
యూఎస్ ఓపెన్ : 2011, 2015, 2018
ఫ్రెంచ్ ఓపెన్ : 2016
మెద్వెదేవ్ ఆట చాలా క్లాస్‌గా ఉంది. డానిల్ ఇక ముందు మనిద్దరం కలసి ప్రాక్టీస్ చేద్దాం. నేను ఆడిన ఆటగాళ్లలో నువ్వు కూడా ఒకానొక గట్టి ప్రత్యర్థివి. నువ్వు కూడా ఏదో ఒక రోజు తప్పకుండా గ్రాండ్‌స్లామ్ గెలవాలని కోరుకుంటున్నాను. ఈ టైటిల్ గెలవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. నా ఫామ్‌ను ఇకపై కొనసాగిస్తాను. – జకోవిచ్