- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పీజీ మెడికల్, డెంటల్ సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్
దిశ, వరంగల్: కన్వీనర్ కోటా కింద మెడికల్, డెంటల్ పీజీ సీట్ల ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 25 వరకు తుది గడువు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు రావాల్సి ఉండగా, ప్రస్తుతం కరోనా వైరస్ దృష్ట్యా రిజిస్ట్రేషన్ సమయంలోనే సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ప్రత్యేకంగా నోటిఫికేషన్ వెలుబడదని యూనివర్సిటీ స్పష్టం చేసింది. దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన తరువాతే తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామనీ, మరిన్ని వివరాలకు కాళోజీ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించవచ్చని పీఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు.
Tags: PG dental, medical entrance, notification, Kaloji Narayana Rao University of Medical Health University, warangal, ts