పోలీసులనే కాదు.. తండ్రిని ముచ్చెమటలు పట్టించిన బాలిక

by Sumithra |
Daughter
X

దిశ, వెబ్‌డెస్క్ : పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో. 11 ఏళ్ల వయసులోనే కన్నింగ్ ప్లాన్ వేసింది ఓ బాలిక. ఏకంగా ఇంటికే ఎసరు పెట్టింది. కన్న తండ్రినే బ్లాక్ మెయిల్ చేస్తూ కోటి రూపాయలు డిమాండ్ చేసింది. ఇంతకూ ఆ అమ్మాయి ఈ కంత్రీ ప్లాన్ ఎందుకు వేసిందో తెలుసా…?

ఉత్తర ప్రదేశ్‌లోని గాజియాబాద్ శాలిమార్‌ గార్డెన్‌ ఏరియాలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ దంపతులకు 11 ఏళ్ల కూతురుతోపాటు కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవల ఓ సంఘటనలో తల్లిదండ్రులు బాలికను మందలించారు. దీంతో తల్లిదండ్రలుపై కోపం పెంచుకున్న కూతురు క్రిమినల్‌లా ఆలోచించింది. తన తండ్రినే బెదిరిస్తూ వాట్సాప్, మెయిల్ చేసింది. రూ.కోటి ఇవ్వకపోతే మీ కుమార్తె, కుమారుడిని చంపేస్తానని మెసేజ్ చేసింది.

ఆ మెసేజ్‌ను చూసి భయపడిన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన గాజియాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును వేగం చేశారు. సదరు మెసేజ్ ఫిర్యాదు దారుడి ఇంటి నుంచే వచ్చినట్లు గుర్తించారు. దీంతో తండ్రి, పోలీసులు ఖంగుతిన్నారు. ఇంటి సభ్యులను ప్రశ్నించగా.. విషయం బయటపడింది. తనను మందలించినందుకే మనస్థాపం చెంది బెదిరిస్తూ మెసేజ్ చేశారని 11 ఏళ్ల కూతురు చెప్పడంతో అంతా విస్మయం వ్యక్తం చేశారు. కాగా, తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసులో బాలికపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Advertisement

Next Story