నోరా‌ ఫతేహి కారుకు యాక్సిడెంట్..

by Shyam |
Nora Fatehi
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కారు ప్రమాదానికి గురైంది. నోరా ‘డ్యాన్స్ మేరీ రాణి’ లాంచ్ ఈవెంట్‌లో ఉండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ తనను పికప్ చేసుకునేందుకు వస్తున్న క్రమంలో ఆటోను ఢీకొట్టాడని సమాచారం. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు నోరా డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘డ్యాన్స్ మేరీ రాణి’ పాట గురించి మాట్లాడిన నటి.. ‘పాటలో నేను కనిపించిన రూపం ఆఫ్రికాలో ఎంతో ప్రేరణ పొందింది. నేను కర్లీ హెయిర్ స్టైల్‌లో డ్యాన్స్ బాగా చేశానని, ఆఫ్రికన్ అమ్మాయిలతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, నా తల్లి అందరూ ఆశీర్వాదించారు’ అని పేర్కొంది. ఇక రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌తో నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ పలుమార్లు విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story