- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్.. చాన్స్ అడిగితే అలా చేస్తారా?
దిశ, సినిమా: కెనడియన్ డ్యాన్సర్ నోరా ఫతేహి 2014లో వచ్చిన ‘రోర్ : టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్’ ద్వారా తన బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ‘బాహుబలి’లో ‘మనోహరి’ సాంగ్‌లో కనిపించిన భామ.. జాన్ అబ్రహం ‘సత్యమేవ జయతే 2’ సినిమాలోని ‘దిల్ బర్’ సాంగ్‌తో స్టార్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి తను చేసిన స్పెషల్ సాంగ్స్ అన్నీ హిట్ కాగా.. ప్రస్తుతం ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్‌లో నటించే అవకాశాలు అందుకుంటోంది.
ఈ క్రమంలో దుబాయ్ బేస్డ్ యూట్యూబ్ షోలో తన కెరియర్ గురించి మాట్లాడిన నోర.. లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ స్థాయికి వచ్చేందుకు తను ఎదుర్కొన్న కష్టాల గురించి తెలుపుతూ ఏడ్చేసింది. ఇండియాలో మాత్రమే కాదు కెనడాలోనూ చాన్స్ ఇవ్వమని అడిగితే తనను చిన్నచూపు చూశారని.. తను ఎదుర్కొన్న స్ట్రగుల్స్‌లో 50శాతం మరో అమ్మాయి చూసి ఉంటే కచ్చితంగా వెనుదిరిగేదని తెలిపింది. కానీ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ చాలా గొప్పదని.. అందుకే నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగానని వెల్లడించింది. అలాంటి వ్యక్తులను కలిసినప్పుడు ప్రపంచం ఇంత దుర్మార్గంగా ఉంటుందా అనిపించిందని.. కానీ ఛీ కొట్టినవారే తనను ప్రశంసించాలనే లక్ష్యంతో ప్రయత్నించానని చెప్పుకొచ్చింది.