ఆ ఇద్దరి పరిశోధనలకు నోబెల్

by Anukaran |
ఆ ఇద్దరి పరిశోధనలకు నోబెల్
X

స్టాక్‌హోం: ‘జీనోమ్ ఎడిటింగ్’పై పరిశోధనలకు గానూ రసాయన శాస్త్ర విభాగంలో ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను ప్రతిష్ఠాత్మక నోబెల్ అవార్డు వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎమాన్యూయెల్ చార్పెంటీర్(51), యూఎస్‌కు చెందిన జెన్నీఫర్ డౌడ్నా(56)లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. రసాయన శాస్త్రంలో ఇప్పటివరకు ఐదుగురు మహిళలు మాత్రమే నోబెల్ బహుమతి అందుకోగా, వీరితో కలిపి ఆ సంఖ్య ఏడుకు చేరింది.

సీఆర్ఐఎస్పీఆర్-సీఏఎస్9 జెనెటిక్ సిజర్స్‌గా తెలిసిన జీన్-ఎడిటింగ్ టెక్నిక్‌ను వీరు అభివృద్ధి చేశారు. పరిశోధకులు ఈ టెక్నిక్‌ను ఉపయోగించి జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డీఎన్‌ఏను అత్యంత ఖచ్చితత్వంతో మార్చవచ్చునని నోబెల్ జ్యూరీ వెల్లడించింది. ఈ సాంకేతికత లైఫ్ సైన్సెస్‌పై విప్లవాత్మక ప్రభావం చూపిస్తుందని, కేన్సర్ చికిత్సలకే కాకుండా వారసత్వంగా వచ్చే వ్యాధులనూ నయం చేయడానికి దోహదపడుతుందని తెలిపింది. వీరు అభివృద్ధి చేసిన సీఆర్ఐఎస్పీఆర్/సీఏస్9 టూల్‌‌ ఇప్పటికే కరువు పరిస్థితులు, తెగుళ్ల బారి నుంచి తట్టుకునే సామర్థ్యం కలిగిన విత్తనాలను రూపొందించి, పంటలో గణనీయమైన లాభాలు తీసుకురావడానికి తోడ్పడింది.

Advertisement

Next Story

Most Viewed