ఎండోమెంట్ పైసలివ్వట్లే.. పద్మాక్షి అమ్మవారికి ధూప దీప నైవేధ్యాల్లేవ్..

by Shyam |   ( Updated:2021-10-05 08:36:53.0  )
ఎండోమెంట్ పైసలివ్వట్లే.. పద్మాక్షి అమ్మవారికి ధూప దీప నైవేధ్యాల్లేవ్..
X

దిశ, కాళోజి జంక్షన్ : హన్మకొండ జిల్లా కేంద్రంలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి కొండపై కొలువై దీరిన అమ్మవారికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి నోచుకోవడం లేదని దేవాదాయ ధర్మకర్తల ట్రస్ట్ అధ్యక్షులు నాగిళ్ళ రామశాస్ట్రీ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడుతూ.. వంశపారంపర్యంగా గత ఐదొందల ఏళ్లుగా నాగిళ్ళ వారి వంశీకులం వారసత్వంగా ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నామన్నారు. ఆలయానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దేవాదాయశాఖ అధికారులు ప్రైవేట్ వ్యాపారస్తులకు లీజ్ పేరుతో అనుమతి ఇచ్చి వచ్చే ఆదాయాన్ని తమ ఆధీనం ఉంచుకుంటున్నారని ఆరోపించారు.

అర్బన్ కుడా డెవలప్ మెంట్ అధికారులు, కమిషనర్, ఎండోమెంట్ మూలంగా దేవాలయానికి పైసా ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా కష్టకాలంలో దేవాలయానికి భక్తులు రాక ధూప దీప నైవేధ్యానికి ఇబ్బందిగా మారిందని, దీనిపై దేవాదాయ శాఖ అధికారులను సంప్రదిస్తే స్పందించలేదన్నారు. ఆలయ అభివృద్ధి కోసం జిల్లా ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ పార్టీల నాయకులను కోరగా, సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రతీ యేడాది జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తుల సహకారంతో నిర్వహిస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, శంకర్ శర్మ, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story