- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదుకునేందుకు డబ్బులిస్తే..తీసుకునేందుకు గుంపులుగా..
సోషల్ డిస్టెన్స్ మరుస్తున్న జనాలు
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు తమ అవసరాల కోసం ఇబ్బందులు పడతారనే దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.500 వేయడంతో పాటు రైతులకు ఇచ్చే రైతు సమ్మాన్ రూ.2,000లను ముందుగానే వేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను ఆదుకునేందుకు రూ.1,500 బ్యాంకు ఖాతాల్లో వేసింది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఈ డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నట్లు తెలుసుకున్న ప్రజలు బ్యాంకులు, సహాయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే, అక్కడ గుంపులు గుంపులుగా ఉంటూ సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించకపోవడం పలువురికి ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వం వేసిన డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుల వద్దకు జనాల తాకిడి ఎక్కువైంది. సాధారణ జనాలతోపాటు ఉద్యోగులు, సామాన్య ఖాతాదారులూ బ్యాంకుల వద్దకు రావడంతో అక్కడక్కడ బ్యాంకులు రద్దీగా ఉన్నాయి. బ్యాంకులతో పాటు ఏటీఎంలు, బ్యాంకు సర్వీస్ సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. అయితే, ఈ అన్ని ప్రదేశాల్లో సామాజిక దూరాన్ని ప్రజలు మరిచిపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎంత చెబుతున్నా ప్రజలు చాలా చోట్ల ఈ సామాజిక దూరం అనే అంశాన్ని పక్కన బెట్టి తమ పద్ధతిలోనే నడుచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ 19 వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టమని అధికారులు అంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Tags: no social distance, bank, customers, people, money, govt