- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకాల కొరత లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: టీకాల కొరత ఉన్నదని, మరో రెండు, మూడు రోజుల్లో టీకా పంపిణీ నిలిపేయాల్సి వస్తుందని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు అత్యవసర సందేశాన్ని కేంద్రానికి పంపిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. దేశంలో కరోనా టీకాల కొరత లేదని, రాష్ట్రాలకు అవసరమైన మేరకు తప్పనిసరిగా అందిస్తామని హామీనిచ్చారు.
ఏ రాష్ట్రమూ టీకా కొరతతో బాధపడకుండా చూస్తామని తెలిపారు. ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా టీకాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. మహారాష్ట్రలో కేవలం 14 లక్షల డోసులున్నాయని, వీటితో రాష్ట్రంలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. తమకు వారానికి 40 లక్షల డోసులు అవసరమవుతాయని వివరించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి మంగళవారం నాటి భేటీలో తెలియజేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ టీకా డోసులు గురువారం వరకు సరిపోతాయని, తర్వాత టీకా పంపిణీని నిలిపేయాల్సి రావచ్చునని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 3.7 లక్షల డోసులున్నాయని, రోజుకు 1.3 లక్షల డోసులను వేస్తున్నామని వివరించారు. అందుకే వెంటనే ఒక కోటి డోసులను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.