ఫైనల్ అయినా ఒత్తిడి లేదు -ట్రెంట్ బౌల్ట్

by Shyam |   ( Updated:2020-11-10 20:56:38.0  )
ఫైనల్ అయినా ఒత్తిడి లేదు -ట్రెంట్ బౌల్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 5వ సారి టైటిల్ ఎగరేసుకొని పోయింది. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్స్ గా ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. మ్యాచ్ అనంతరం ట్రెంట్ బౌల్ట్ మాట్లాడుతూ… నాకు పవర్ ప్లేలో వికెట్లు తీయడం చాలా ఆనందంగా ఉంటుందన్నారు. ఫ్రాంచైజీ కోసం మంచి ఆరంభాన్ని ఇచ్చాను. ఫైనల్ మ్యాచ్ అయినా నాపై ఒత్తిడి లేదు. అన్ని మ్యాచ్‌ల లాగే ఇది మరో మ్యాచ్ అని ఆడాను. కొత్త బంతితో స్వింగ్ లభిస్తుండటంతో వికెట్లు తీయడం సులువుగా మారిందని బౌల్ట్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story