బ్రిటన్ మహిళకు నో ఒమిక్రాన్.. డీహెచ్ ప్రకటన

by Shyam |   ( Updated:2021-12-06 04:34:19.0  )
బ్రిటన్ మహిళకు నో ఒమిక్రాన్.. డీహెచ్ ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహిళలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తేలలేదని హెల్త్ డైరెక్టర్ డా.జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 5 రోజుల క్రితం వచ్చిన ఆమెకు ఎయిర్ పోర్టు లో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను టిమ్స్ ఆసుపత్రికి తరలించి శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్స్‌కు పంపించారు. ఈ రోజు ఉదయం ఆమె శాంపిల్ లో కొత్త వేరియంట్ లేదని తేలింది. మరో 12 మంది రిపోర్ట్ లు సాయంత్రం వచ్చే అవకాశం ఉందని డీహెచ్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 12 ఎట్​ రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్​కు 900 మందికి పైగా రాగా.. ఎయిర్​పోర్టులో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయింది.

Advertisement

Next Story

Most Viewed